ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్త డంప్‌చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డంప్‌యార్డులో చెత్తను వేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని డంప్‌యార్డ్‌ను సందర్శించారు. నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను డంప్‌యార్డ్ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారనే స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. వాహనాల్లో తీసుకొచ్చిన చెత్తను డంప్‌యార్డ్‌కు వెళ్లే రోడ్డుపైనా, గేట్ ముందు పడేయొద్దన్నారు. క్రమపద్ధతిలో డంప్ చేయాలన్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త, ఎత్తుపల్లాలను సరి చేయాలన్నారు. చెత్తను తీసుకువచ్చే వాహనాలు డంప్‌యార్డ్ లోపలికి సులువుగా వెళ్లేలా రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు చెత్త వాహనాలు డంప్ యార్డుకు వచ్చే సమయంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి, వాహనాలు లోపలికి వెళ్లి క్రమపద్ధతిలో చెత్తను డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి, ఎంహెచ్‌వో సుమన్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
విద్యానగర్(కరీంనగర్): మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవ అధికారి, న్యాయమూర్తి వెంకటేశ్ సూచించా రు. నగరంలోని అశోక్‌నగర్‌లో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శక్తిసదన్‌ను గురువారం సందర్శించారు. శక్తిసదన్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళలకు చట్టా లపై అవగాహన కల్పించారు. శక్తిసదన్ సూపరింటెండెంట్ ఎ.రమదేవి. వసంత, రజిత, భాఽగ్యలక్ష్మి పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్న 0–18 సంవత్సరాల పిల్లలకు జిల్లా మాత శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆర్‌బీఎస్‌కే బృందాల ద్వారా 76మంది పిల్లలు హాజరయ్యారు. ఇందులో 29మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించా రు. వీరికి అపోలో హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స చేయనున్నారు. శిబిరం శుక్రవారం కూడా కొనసాగనుంది. డీఎంహెచ్‌వో వెంకటరమణ పిల్ల ల తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. డీఐవో డాక్టర్ సాజిద, జిల్లా ఉప వైద్యాధికారి రాజ గోపాల్‌రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీనా, డీపీవో స్వామి, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్– కార్డియాలజిస్ట్ వైద్యులు అమూల్ గుప్త, సిటి సర్జన్ సునీల్ కుమార్ సేన్ పాల్గొన్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్‌ఎల్‌బీ 4వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీసీ ఉమేశ్ కుమార్ ఆర్ట్స్ కళాశాల పరీక్షకేంద్రాన్ని సందర్శించి, పరీక్షలు తీరును పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, మూల్యాంకనం కూడా త్వరగా పూర్తిచేసి ఫలితాలను సకాలంలో విడుదల చేస్తామని అన్నారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, హరికాంత్ పాల్గొన్నారు. కాగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన నలుగురిని డిబార్ చేయాలని వీసీ ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్త డంప్‌చేయాలి
ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్త డంప్‌చేయాలి


