అర్బన్‌లో త్రిముఖ పోరు
ఎన్నికల ప్రకియ తీరిలా
తొలి రోజు: 05,
రెండో రోజు: 27
చివరి రోజు: 33
కరీంనగర్ అర్బన్: అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. నిన్నటి వరకు రెండు వర్గాల మధ్యే పోటీ ఉండగా తాజాగా మూల వెంకటరవీందర్‌రెడ్డి వర్గంతెరపైకి రాగా ప్యానెల్‌తో సహా నామినేషన్ వేశారు. దీంతో కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్‌రెడ్డి, వెంకటరవీందర్‌రెడ్డి వర్గాల మధ్య పోరు నెలకొంది. ఎవరికి వారుగా ప్యానెల్‌ను సిద్ధం చేసుకోగా నామినేషన్లు తిరస్కరణకు గురవకుండా రెండు, మూడు సెట్లతో వేశారు. గురువారం 33 నామినేషన్లు దాఖలవగా 12 డైరెక్టర్ పోస్టులకు 73 వచ్చాయని ఎన్నికల అధికారి సీహెచ్.మనోజ్‌కుమార్ వివరించారు. ఎక్కువగా కరీంనగర్ నుంచి రంగంలో ఉండగా జగిత్యాల నుంచి నలుగురు బరిలో ఉన్నారు.
చివరి రోజున 33 నామినేషన్లు
గురువారం 33 మంది నామినేషన్లు దాఖలు చేశా రు. జనరల్ స్థానాలకు 23, ఎస్సీ, ఎస్టీ స్థానానికి 6, మహిళా కేటగిరీకి 4 నామినేషన్లు వేశారు. అర్బన్ బ్యాంకు డైరెక్టర్లలో రెండు మహిళలకు రిజర్వ్ చేయగా ఒకటి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు సంబంధించి ఏడుగురు బరిలో ఉండగా ఎస్సీ, ఎస్టీ స్థానానికి 11మంది పోటీపడుతున్నారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు ప్రక్రియ సాగనుండగా తదుపరి జాబితాను ప్రకటించనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా 26నుంచి అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమవనున్నారు.
ప్యానెళ్లపై గురి
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతుండగా ఎవరికి వారుగా ప్యానెళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండటంతో ప్యానెళ్లను ప్రకటించేందుకు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్‌రావు మద్దతుతో బరిలో ఉన్నానని ప్రకటించిన వెంకటరవీందర్‌రెడ్డి మాత్రం తన ప్యానెల్‌ను ప్రకటించారు. తనతో పాటు ఈ.లక్ష్మణ్‌రాజు, అనురాస్ కుమార్, వజీర్ అహ్మద్, నార్ల శ్రీనివాస్, ఉయ్యాల ఆనందం, చిదం శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్, సరిళ్ల రతన్‌రాజు, మునిపల్లి ఫణిత, దామెర శ్రీలత బరిలో ఉంటారని వెల్లడించారు.
కేటగిరీ డైరెక్టర్ల సంఖ్య నామినేషన్లు
జనరల్ 09 55
మహిళ 02 07
ఎస్సీ,ఎస్టీ 01 11
మొత్తం 12 73
నామినేషన్ల పరిశీలన: 24న
ఉపసంహరణ: 25న
పోలింగ్: నవంబర్ 1
పాలకవర్గం ఎన్నిక: నవంబర్ 4లోపు


