నషా ముక్త్ రంగోళి
కరీంనగర్‌టౌన్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ క్లబ్ వద్ద రోడ్డుపై కళాశాల విద్యార్థులు, మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై 27మంది వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ముగ్గులను పరిశీలించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సీడీపీవో సబిత, నర్సింగరాణి, సుగుణ, శ్రీలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తిరుపతి పాల్గొన్నారు.


