కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రామడుగు: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్విని యోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో గురువా రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. రైతులు దళారీలకు ధాన్యం అమ్ముకోవద్దని, ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర అందిస్తోందన్నారు. అనంతరం కొక్కెరకుంట, రంగసాయిపల్లి, మోతె, దత్తోజీపల్లి, శ్రీరాములపల్లి, షానగర్ గ్రా మాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. గోపాల్‌రావుపేట మార్కెట్ కమి టీ చైర్మన్ బొమ్మరవేని తిరుపతి, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


