హ్యాండ్‌బాల్ విజేత రాజన్నసిరిసిల్ల
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ పోటీల్లో విజేతగా రాజన్నసిరిసిల్ల జిల్లా జట్లు నిలిచాయి. గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌లకు చెందిన 8 జట్లు పాల్గొన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికల విభాగాల్లో రాజన్న సిరిసిల్ల జట్లు ప్రథమ, కరీంనగర్ జట్లు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు స్థానిక నాయకుడు దమ్మ శ్రీనివాస్‌రెడ్డి బహుమతులను అందించారు. షాదుల్, మల్లేశం భోజన వసతి కల్పించారు. పీడీ భార భాను, ఎంఈవో గంగారాం, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, అశోక్, సుమన్, కృష్ణహరి పాల్గొన్నారు.
ద్వితీయస్థానంలో కరీంనగర్


