టీ20 జట్టుకు శ్రీవల్లి
కరీంనగర్‌స్పోర్ట్స్/ఇల్లంతకుంట: కరీంనగర్‌కు చెందిన శ్రీవల్లి హైదరాబాద్ మహిళల అండర్–19 టీ20 జట్టుకు ఎంపికై ంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల 26 నుంచి ముంబయి వేదికగా బీసీసీఐ అండర్–19 టీ20 ఉమెన్ ట్రోఫీ జరగనుంది. చిన్న వయస్సులో బెస్ట్ బౌలర్‌గా పేరు సంపాదించిన శ్రీవల్లి భవిష్యత్‌లో భారత మహిళల జట్టులో చోటు దక్కాలని పలువురు ఆకాంక్షించారు. కూతురు ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమ, లక్ష్మారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.


