అందరి అభిప్రాయం ముఖ్యమే..
కరీంనగర్ కార్పొరేషన్: పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని పీసీసీ పరిశీలకుడు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన, డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్‌తో కలిసి అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి స్వాగతం పలికారు.
వాకింగ్ ట్రాకా.. హైవే రోడ్డా!
కరీంనగర్ కార్పొరేషన్: అధికారులు కళ్లు మూ సుకుంటే, కాంట్రాక్టర్లు చెలరేగిపోతారనడానికి నగరంలోని స్మార్ట్‌సిటీ పార్క్‌లే నిదర్శనం. జ్యో తిబాపూలే పార్క్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి నగరపాలకసంస్థ అప్పగించింది. సదరు ఏజెన్సీ నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టారీతిన వ్యవహరిస్తుండడం గతంలోనూ వివాదాస్పదంగా మారింది. తాజాగా వాకింగ్ ట్రాక్‌పై ఏకంగా కార్లు నడుపుతున్నా, నగరపాలకసంస్థ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. జ్యోతి బా పూలే పార్క్‌లో టపాసుల దుకాణాలు ఏర్పా టు చేయడంతో, కొనుగోలుదారులు అధికసంఖ్యలో వస్తున్నారు. శనివారం పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌పై ఏకంగా కారు నడిపించడం కనిపించింది. ఓ వైపు వాకర్స్ నడుస్తుండగానే, కారు ట్రాక్‌పై పోనీయడం గమనార్హం. వాకర్స్ కోసమే మల్టీపర్పస్, జ్యోతిబా పూలే పార్క్‌ల్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్‌పై వాహనలు నడిపించడంపై వాకర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నవోదయ గడువు పొడిగింపు
చొప్పదండి: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండో తరగతిలో 2026– 27 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లభర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీని ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు, తొమ్మిదోతరగతి కోసం, పదోతరగతి చదువుతున్న విద్యార్థులు పదకొండో తరగతిలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు, ఏవైనా సవరణలు చేయడానికి ఈ నెల 24 నుంచి 26వరకు కరెక్షన్ విండో తెరవబడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు నవోదయ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
బీసీలపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ
కరీంనగర్: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ నేడు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్‌రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన బీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చి చరిత్ర సృష్టించిందన్నారు. కులగణనపై మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, 75 ఏళ్ల తర్వాత దేశంలో 2027లో జరగబోయే దేశ జనగణన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, శాసీ్త్రయ పద్ధతిలో, డిజిటల్ ఆధారాలతో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
పశువులకు ఆపదా.. టోల్‌ఫ్రీ నంబర్ 18004252244
కరీంనగర్ అర్బన్: అత్యవసర పశువైద్యానికి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి ప్రత్యేక నంబర్‌ను ఏర్పాటు చేశారు. పాడి సంపదను పరిరక్షించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పశువులకు అత్యవసర వైద్యం అందేలా టోల్ ఫ్రీ 18004252244 నంబర్‌ను ఏర్పాటు చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ నంబర్ కేవలం అత్యవసర వైద్యానికేనని, సాధారణ వైద్యానికి వినియోగించవద్దని డాక్టర్ లింగారెడ్డి వివరించారు.
అందరి అభిప్రాయం ముఖ్యమే..


