బీసీ బంద్ సక్సెస్
పాల్గొన్న బీసీ సంఘాల జేఏసీ, వివిధ పార్టీలు
ముందస్తుగా బస్సులు నిలిపివేసిన ఆర్టీసీ
ప్రధాన రహదారులపై రాస్తారోకో, ధర్నా
కరీంనగర్/కరీంనగర్‌టౌన్: బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. కరీంనగర్‌లో బీసీ సంఘాలకు మద్దతుగా పలు కుల, సామాజిక సంఘాలు, పార్టీల నేతలు ఉదయం నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ ముందస్తుగా బస్సులను నిలిపివేసింది. బస్టాండు ప్రయాణికులు లేక బోసిపోయింది. టవర్ సర్కిల్‌లో దుకాణాలు మూసివేశారు. నగరంలోని పలుచోట్ల కొన్ని దుకాణాలు, హోటళ్లు తెరువగా వాటిని మూయించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పలుచోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. ఆల్ ఇండియా యూత్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ రావుల ఆదిత్య, అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఆటో సంఘం అధ్యక్షుడు మద్దెల రాజేందర్, నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు నీలం మొండయ్య తదితరులు పాల్గొన్నారు.
నిర్మానుష్యంగా బస్టాండ్ ప్రాంతం
నగరంలో మూసిఉన్న దుకాణాలు
బీసీ బంద్ సక్సెస్
బీసీ బంద్ సక్సెస్


