లాస్ట్‌డే పోటెత్తిన లిక్కర్ దరఖాస్తులు
జిల్లాలో వైన్స్‌లు.. వచ్చిన దరఖాస్తులు
కరీంనగర్‌క్రైం: రాష్ట్ర ప్రభుత్వం 2025– 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన మద్యం టెండర్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరిరోజు దరఖాస్తులు పోటెత్తగా.. జిల్లాలోని ఎకై ్సజ్ కార్యాలయాల్లో అర్ధరాత్రి దాటినా ప్రక్రియ కొనసాగింది. గతనెల 26న ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ని రోజులు ఆచితూచి వ్యవహరించిన మద్యం వ్యాపారులు చివరిరోజు గ్రూపులుగా మారి టెండర్లు వేశా రు. దీంతో మొత్తం దరఖాస్తుల్లో సగం చివరిరోజే పడ్డాయి. గతేడాది కన్నా తక్కువే టెండర్లు దాఖలు కాగా.. దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచడమే ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా మొత్తం 4,040 టెండర్లు దాఖ లు కాగా.. ప్రభుత్వానికి రూ.80.80 కోట్ల ఆదా యం సమకూరింది. ఈసారి శనివారం అర్ధరాత్రి వరకు 2,519 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. టెండర్ల సంఖ్య తగ్గినా ఆదాయం సమకూరడంతో ఆబ్కారీవర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈనెల 23న లక్కీ డ్రా తీయనున్నారు. కరీంనగర్‌లో టెండర్ల ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్, ఎకై ్సజ్‌శాఖ జాయింట్ కమిషనర్ సురేశ్ రాథోడ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పరిశీలించారు.
చివరిరోజు సిండికేట్?
ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించడంతో, కొత్తవారు టెండర్ వేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. టెండర్ ఫీజు పెంచడం లిక్కర్ కింగ్‌లకు కలిసొచ్చిందని పలువురు అనుకుంటున్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారంలో కొనసా గుతున్నవారు ఫీజుకు భయపడకుండా, చివరిరోజు గ్రూపులుగా ఏర్పడి పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. టెండర్‌లో తాము కోరుకున్న వైన్స్‌లు దక్కితే లిక్కర్‌కింగ్‌లు సెలెంట్‌గా ఉంటారని, లేదంటే ఆయాస్థానాల్లో ఇతరులు దక్కించుకున్న వైన్స్‌లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చ జరుగుతోంది.
సర్కిల్ వైన్స్‌లు దరఖాస్తులు
కరీంనగర్ అర్బన్ 21 699
కరీంనగర్ రూరల్ 26 743
తిమ్మాపూర్ 14 443
హుజూరాబాద్ 17 337
జమ్మికుంట 16 297
మొత్తం 94 2,519


