‘సాక్షి’పై కక్ష సాధింపు విడనాడాలి
కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడానాడాలని పలువురు కవులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని సూర్య రెసిడెన్సీలో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లాశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుడు షోయబ్ ఉల్లా ఖాన్ జయంతి సభ నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. పాత్రికేయ వృత్తి సవాళ్లు, విశిష్టతను గురించి చర్చించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్, పీఎస్.రవీంద్ర, దామరకుంట శంకరయ్య, నసీరుద్దీన్, వాజీద్, మునీర్, నెరువట్ల చైతన్య, విలసాగరం రవీందర్, మెరుగు ప్రవీణ్, ఖాలీద్ పాల్గొన్నారు.
సాక్షి కార్యాలయంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడం తగదు. నోటీసు ఇచ్చేందుకని వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. భయపెట్టేలా ప్రవర్తించడం దారుణం. సాక్షి ఎడిటర్‌పై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. – కసిరెడ్డి మణికంఠ రెడ్డి,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. సాక్షి ఎడిటర్‌పై కక్షసాధింపు సరికాదు. విచారణ పేరుతో సాక్షి కార్యాలయంలో హల్‌చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఏపీ ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడిని ఖండిస్తున్నాం. మీడియాను అణచివేయాలనుకోవడం హేయమైన చర్య. – ఎస్.రజనీకాంత్,
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు
‘సాక్షి’పై కక్ష సాధింపు విడనాడాలి
‘సాక్షి’పై కక్ష సాధింపు విడనాడాలి
‘సాక్షి’పై కక్ష సాధింపు విడనాడాలి


