ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం

Oct 17 2025 6:36 AM | Updated on Oct 17 2025 6:36 AM

ట్రాన

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం సభ్యత్వం స్వీకరణ

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌సర్కిల్‌ బాస్కెట్‌ బాల్‌, టేబుల్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌ను గురువారం ట్రాన్స్‌కో కరీంనగర్‌ జోన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ జె.విజయ్‌కుమార్‌ పాపారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఎంతో ప్రాముఖ్యమైనవి, వీటితో మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వృత్తిరీత్యా ఒత్తిడికి లోనయ్యే ఉద్యోగులకు ఈ ఆటలతో ప్రశాంతత లభిస్తుందన్నారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఎన్‌.జగన్నాథ్‌, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు పి.రఘునందన్‌, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, ఎస్‌ఈలు టి.వి.రావు, ఎన్‌.శ్రీనివాసు, ఎం.వేంకటేశ్వర్లు, పి.త్రిపురాంతకం, పివీరావుతో పాటు కరీంనగర్‌, నల్గొం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నా రు. టేబుల్‌ టెన్నీస్‌లో ఓఎంసీ సర్కిల్‌ కరీంనగర్‌, ఆపరేషన్‌ సర్కిల్‌ వరంగల్‌ ఫైనల్‌కు చేరకోగా టేబుల్‌ టెన్నీస్‌లో కరీంనగర్‌ ఆపరేషన్‌, నిజామాబాద్‌, నల్గొండ ఆపరేషన్‌, ఖమ్మం ఆపరేషన్‌ జట్లు ముందంజలో ఉన్నాయి.

పత్తి మార్కెట్‌కు నాలుగు రోజుల సెలవు

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు నాలుగు రోజుల సెలవులు ఉంటాయని మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పుల్లూరి స్వప్నసదానందం, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం యథావిధిగా కొనుగోళ్లు ఉంటాయని, శని, ఆదివారం సాధారణ సెలవులు, సోమవారం దీపావళి, మంగళవారం అమావాస్య సెలవులు ఉంటాయని వివరించారు. గురువారం క్వింటాల్‌ పత్తి రూ. 6,700 పలికిందని పేర్కొన్నారు.

బహుమతులు ప్రదానం

విద్యానగర్‌(కరీంనగర్‌): బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో నిర్వహించిన లక్కీడ్రా విజేతలకు గురువారం కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ ఆవరణలో ఆర్‌ఎం బి.రాజు బహుమతులు అందించి, సన్మానించారు. కరీంనగర్‌కు చెందిన ఇ.రమేశ్‌కు మొదటి బహుమతిగా రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన సదానందంకు రెండో బహుమతిగా రూ.15వేలు చెక్కురూపంలో అందించారు. డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు ఎస్‌.భూపతిరెడ్డి, పి.మల్లేశం, రీజియన్‌ పరిధిలోని డిపోల మేనేజర్లు ఎం.నాగభూషణం, ఎన్‌.వెంకన్న, వి.రవీంద్రనాథ్‌, ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్‌, వి.శ్రవణ్‌కుమార్‌, కె.కల్పన, ఎస్‌.మనోహర్‌, టి.దేవరాజు, టి.ప్రకాశ్‌రావు, బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విద్మానగర్‌(కరీంనగర్‌): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్‌లో నిర్వహించే రాష్ట్రస్ధాయి చెకుముకి సంబరాలు సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌పై గురువారం కలెక్టర్‌ పమేలా సత్పతికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ బాధ్యులు వివరించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంలో జనవిజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా చేస్తున్న కృషిని ఆమె అభినందించి సభ్యత్వాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ రాజేశ్వర్‌. కార్యదర్శి రాజా, ప్రొఫెసర్లు రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, బీఎన్‌ రెడ్డి, వరప్రసాద్‌, రామరాజు, సంపతి, రమేశ్‌తోపాటు జిల్లా అధ్యక్షుడు ఆర్‌ వెంకటేశ్వర్‌ రావు, కార్యదర్శి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం1
1/3

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం2
2/3

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం3
3/3

ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌ సర్కిల్‌ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement