భవనం పై నుంచి పడి యువకుడి మృతి
మెట్‌పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి నర్సింహులు(32) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్ర కారం..స్థానిక చైతన్యనగర్‌కు చెందిన నర్సింహు లు స్డేడియానికి వచ్చి భవనంపైకి వెళ్లాడు. ప్ర మాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గా యపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): మండలంలోని గర్రెపల్లి–సుల్తానాపూర్ రోడ్డులో గు రువారం రాత్రి సైకిలి స్టును ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్న ఘటనలో ఎలిగేడు మండలం సుల్తానాపూర్‌కు చెందిన అడెపు కుమార్(40) మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. సుల్తానాపూర్‌కు చెందిన కుమార్ హైదరాబాద్‌లో ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో సుల్తానాపూర్‌లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద సైకిలిస్ట్‌ను తప్పించబోయి కిందపడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఐతరాజుపల్లికి చెందిన సైకిలిస్టుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్‌రోడ్‌లో ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ప్రభుత్వ వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్‌డీవోగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం బైపాస్ రోడ్ నుంచి తన స్కూటీపై ఆస్పత్రికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
జ్యోతినగర్(రామగుండం): రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది ఓ అమ్మ. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో..ఎందుకు వదిలేశారో కూడా చెప్పుకోలేక అనాథగా రోడ్డుపై పడిపోయింది. ఎన్టీపీసీ రామగుండం ఆటోనగర్ ప్రాంతంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కొద్దిరోజులుగా కాలనీలో సంచరిస్తూ గురువారం రాత్రి సమయంలో రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో ఆటోనగర్ ప్రజలు ఆమె పడిపోయిన విషయాన్ని కంది నాగరాజుకు తెలియజేయగా ఆయన ఆమె వివరాలను ఆరా తీశారు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామమని, తన పేరు లక్ష్మమ్మ అని తెలియజేసింది. వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పతికి తీసుకెళ్లారు.
కరీంనగర్ క్రైం: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఉద్దేశించి మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ ఇటీవల వాట్సాప్‌లో ఒక వాయిస్ మెసేజ్ పంపినట్లు ఎమ్మెల్యే తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
భవనం పై నుంచి పడి యువకుడి మృతి
భవనం పై నుంచి పడి యువకుడి మృతి


