రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి తాళం వేసి రెండు రోజులక్రితం ఊరికెళ్లాడు. బుధవారం సాయంత్రం ఇంటికొసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో అద్దెకున్న వారు కూడా లేకపోవడంతో వారి ఇంటి తాళాలు కూడా పగులగొట్టారు. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో నుంచి 15 తులాల వెండి, రూ.10వేలు, అద్దెకుంటున్న వారి ఇంట్లో బంగారం, రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
మెట్‌పల్లి: మెట్‌పల్లిలోని హన్మాన్‌నగర్‌కు చెందిన మానస ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో మానస ఇంటికి తాళం వేసి తల్లిగారింటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి రాగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో దాచి ఉంచిన 4తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందిచంగా.. వారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
15 తులాల వెండి..
రూ.16 వేలు చోరీ
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ


