రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
● 16మందికి గాయాలు
● కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో ఘటన
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం బ స్టాండ్ ఎదుట గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నా యి. ఈ ఘటనలో కండక్టర్‌తో పాటు 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హుజూ రాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సు కరీంనగర్ వెళ్తోంది. సిరిసిల్ల డిపోకు చెందిన డీలక్స్ వరంగల్ వెళ్తోంది. కేశవపట్నం బస్టాండ్‌లోకి వెళ్లేందుకు హుజురాబాద్ డిపో బస్సును డ్రైవర్ కుడివైపు తిప్పాడు. ఈ క్రమంలో వరంగల్ వైపు వెళ్తున్న డీలక్స్ బస్సు ఢీకొంది. రెండు బస్సుల ముందు భాగం దెబ్బతినగా, కండక్టర్‌తో పాటు 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 108లో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ దెబ్బతిన్న బస్సులను బస్టాండ్ ఆవరణలోకి తరలించారు. అద్దెబస్సు డ్రైవర్ షబ్బీర్ బేగ్ ఫిర్యాదుతో సిరిసిల్ల డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.


