విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
కరీంనగర్: అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో అగ్రగామిగా నిలుస్తున్న గ్లెనిగల్స్ హాస్పిటల్స్ ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంట్) రంగంలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్టు తపస్వికృష్ణ, పల్మనాలజిస్టు వినయ్‌కుమార్ తెలిపారు. గురువారం కరీంనగర్‌లోని సూర్య చెస్ట్ హాస్పిటల్‌లో లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఊపిరితిత్తుల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సల ప్రాధాన్యం గురించి వివరించారు. దగ్గు, అలసట, దీర్ఘకాలికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చాతినొప్పి, రోజువారీ పనుల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. గ్లెనిగల్స్ హాస్పిటల్స్‌లో లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌లు విజయవంతం కావడం వెనుక సర్జన్లు, అనస్థీషియా నిపుణుల సమష్టి కృషి ఉందన్నారు. రామడుగు మండలం గుండిగోపాలరావుపేటకు చెందిన రాజిరెడ్డి దశాబ్ద కాలంగా సీపీవోడీతో బాధపడుతూ నిరంతరం ఆక్సిజన్‌పై ఆధారపడి జీవించేవారని, గ్లెనిగల్స్ వైద్య బృందం సలహా మేరకు ఆయనకు లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌లపై ఉన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ తపస్వి కృష్ణ


