మల్యాల: కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి బలైంది. ఈ ఘటన కొండగట్టులో గురువారం చోటుచేసుకుంది. భక్తులు, ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెనగంటి సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి కొండగట్టులోని అంజన్న దర్శనానికి వచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు సత్యనారాయణ తల్లి రాజేశ్వరి (84), భార్య సరి త కోనేరు పక్కనే ఉన్న టాయిలెట్స్ వద్దకు వెళ్లారు. టాయిలెట్స్ గోడకు ఆనుకుని ఉన్న ఇనుప జాలిని రాజేశ్వరి పట్టుకుంది. అప్పటికే ఆ జాలికి విద్యుత్ ప్రసారం అవుతోంది. షాక్‌తగిలి రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. అత్తను కాపాడే క్రమంలో సరిత తీవ్రంగా గాయపడింది. తన తల్లి మృతికి కొండగట్టు ఆలయ ఈవో, అధికారుల నిర్లక్ష్యమే కారణమని సత్యనారా యణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవోతోపాటు సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
టాయిలెట్స్ గోడ ఇనుప జాలికి విద్యుత్ ప్రసారం
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి వృద్ధురాలు మృతి
కాపాడే క్రమంలో వృద్ధురాలి కోడలికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘటన


