తల్లిదండ్రుల మృతి.. అనాథగా బాలుడు
చొప్పదండి: ఇటీవల గుండెపోటుతో తండ్రి మృతిచెందగా అనాథగా మారిన బాలుడి ఉదంతమిది. మూడేళ్ల క్రితమే ఊపిరితిత్తుల వ్యాధితో తల్లి మృతి చెందగా, దిక్కుతోచని స్థితిలో బంధువుల వద్ద కాలం వెల్లదీస్తున్నాడు. మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ అశోక్ గత ఆదివారం మృతిచెందాడు. అశోక్ భార్య కూడా మూడేళ్ల క్రితమే మృతి చెందింది. అంతేకాదు అతడి తల్లి కూడా ఏడాది క్రితం మూత్ర పిండాల వ్యాధితో చనిపోయింది. దీంతో అశోక్ కుమారుడు స్వాద్విన్ కుమార్ అనాథగా మారాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న స్వాద్విన్ ప్రస్తుతం మేనత్తల సంరక్షణలో ఉంటున్నాడు. ఎవరూ లేరని తెలిసి రోదిస్తున్నాడు. ప్రభుత్వం, అధికారులు, దాతలు స్పందించి విద్యార్థిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నృసింహుడి హుండీ ఆదాయం రూ.46.84 లక్షలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా లభించిన ఆదాయాన్ని బుధవారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. 112 రోజులకు గాను రూ.46,84,046 సమకూరినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల మిశ్రమ బంగారం, 4.700 కిలోల వెండి, 26 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ జిల్లా పరిశీలకులు రాజమౌళి, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల మృతి.. అనాథగా బాలుడు


