వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోచీబజార్‌లోని వేదిక షాపింగ్‌మాల్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సుమారు రూ.40 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. షాపింగ్‌మాల్ నిర్వాహకులు మంగళవారం రాత్రి తాళం వేసి వెళ్లారు. మాల్ నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సకాలంలో చేరుకుని మంట లను ఆర్పివేశారు. ఇరువైపులా మంటలు వ్యాపించకుండా కట్టడి చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 40 లక్షల విలువైన వస్త్రాలు కాలిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
సుమారు రూ.40 లక్షల నష్టం


