ఉద్యమనేతలకు శిక్షణ ఇక్కడే
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)కు 57ఏళ్లు పూర్తయ్యాయి. పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన పెద్దపల్లి డివిజన్‌లో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటుకోసం 1965లో 20 ఎకరాల స్థలం కేటాయించారు. 1968 సెప్టెంబర్ 20న అప్పటి కార్మికశాఖ మంత్రి కేవీ నారాయణరెడ్డి ప్రారంభించారు. 57ఏళ్ల కాలానికి ఈ ప్రభుత్వ ఐటీఐలో కొత్త ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)ను ఇటీవల ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. పూర్తికాగానే ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
వేణు సహా ఉద్యమనేతలకు శిక్షణ
పెద్దపల్లి పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోఝుల కోటేశ్వర్‌రావు సోదరుడు మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు మల్లోఝుల వేణుగోపాల్‌తోపాటు సాయిని ప్రభాకర్, సత్యనారాయణ, టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర మాజీఅధ్యక్షుడు దేవీప్రసాద్ కూడా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలోనే శిక్షణ పొందారు. మల్లోఝుల వేణుగోపాల్ రేడియో, టెలివిజన్ కోర్సు శిక్షణ పొందారు.
పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐకి 57 ఏళ్లు


