రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలకు ఎంపిక
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో చేపట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14 పోటీలు మంగళవారం ముగిశాయి. కబడ్డీలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిని డీఈవో మాధవి అభినందించారు. కబడ్డీ బాలుర పోటీల్లో పెద్దపల్లి జట్టు ప్రథమ, జగిత్యాల ద్వితీయస్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో జగిత్యాల జట్టు ప్రథమ, కరీంనగర్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. వారంతా ఈనెల 16 నుంచి 18 దాకా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. పీఈటీలు సురేందర్, రమేశ్, శోభరాణి, శ్రీనివాస్, శైలజ, కబడ్డీ అసోసియేషన్ నాయకులు వైద కిష్టయ్య, తోట శంకర్, శ్రీధర్, షఫియొద్దీన్, భాస్కర్ తదితరులు ఉన్నారు.
ముగిసిన ఉమ్మడిజిల్లాస్థాయి పోటీలు


