రేషన్‌బియ్యం పట్టివేత
● దుబ్బపల్లిలో 300క్వింటాళ్లు స్వాధీనం
● నిందితుడిపై కేసు నమోదు
కరీంనగర్‌రూరల్: రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై కరీంనగర్‌రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. 300 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు కరీంనగర్ మండలం దుబ్బపల్లిలోని బుడిగెజంగాల కాలనీలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కర్రె గంగారాం ఇంట్లో నిల్వ చేసిన 629 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. గంగారాం గత కొన్ని నెలల నుంచి సమీప గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి లారీల్లో మహారాష్ట్రకు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నాడు. గంగారాంపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.


