కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నా
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. మంగళవారం మాట్లాడుతూ 1981లో కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశానని తెలిపారు. రాష్ట్రంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత తనదన్నారు. అనివార్య కారణాలవల్ల వేరే పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 2017లో తిరిగి అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌లో చేరానని వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్విర్తిస్తానని తెలిపారు.


