పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులు పూర్తి చేయాలి

Oct 15 2025 6:08 AM | Updated on Oct 15 2025 6:08 AM

పనులు

పనులు పూర్తి చేయాలి

హాజరుశాతం పెంచాలి బకాయిలు చెల్లించాలి మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి కరీంనగర్‌: మానవ అక్రమ రవాణాను నిర్మూలించడంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావా లని డీఈవో మొండయ్య, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌ అంబర్‌ సింగ్‌ సూచించారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వాణినికేతన్‌ కిడ్స్‌ కేర్‌ హాల్లో రెండు రోజుల శిక్షణా శిబిరం మంగళవారం ప్రారంభమైంది. మానవ అక్రమ రవాణా, దాని ప్రభా వాలు ఎలా ఉంటాయో వివరిస్తూ.. పాఠశాలలస్థాయిలో పేరెంట్స్‌ మీటింగ్స్‌ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా సైబర్‌ ట్రాఫికింగ్‌ వల్ల చిన్నారులు, విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని హెచ్చరించారు. బీఎన్‌ఎస్‌, ఐటీపీఏ, పోక్సో, పీసీఎంఏ, సఖి, భరోసా, చైల్డ్‌లైన్‌, పోలీస్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 1098, 100, 181, 1930 వంటి సేవలపై అవగాహన కల్పించారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు స్మార్ట్‌సిటీ పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన డిజిటల్‌ లైబ్రరీ, బాలసదన్‌, ఐసీసీసీ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ నెలలోనే ఎస్‌వీపీ భవన ఆధునీకరణ పనులు పూర్తి చేసి, ప్రారంభించాలన్నారు. టవర్‌ సర్కిల్‌ పునర్‌నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకో వాలన్నారు. నగరంలో వీధి దీపాలు వెలిగేలా చూడాలన్నారు. నల్లాపన్ను వసూళ్లపై స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టాలన్నారు. ఎస్‌ఈ రాజ్‌ కుమార్‌, ఈఈలు సంజీవ్‌ కుమార్‌, యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, ఓం ప్రకాశ్‌, అయూబ్‌ఖాన్‌, దేవేందర్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అహ్మదాబాద్‌ సదస్సుకు కమిషనర్‌

స్మార్ట్‌సిటీ సదస్సులో పాల్గొనేందుకు కమిషన ర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అహ్మదాబాద్‌కు వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. 17వ తేదీన కరీంనగర్‌కు తిరిగి రానున్నారు.

కొత్తపల్లి(కరీంనగర్‌)/కరీంనగర్‌టౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుశాతాన్ని పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ తానాజీ వాకడే సూచించారు. కరీంనగర్‌ అర్బన్‌ పరిధిలోని మల్కాపూర్‌ 2వ అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కేంద్రాల్లో పిల్లల గ్రోత్‌ క్రాస్‌చెక్‌ పరిశీలించారు. మోనూ, హాజరు నమోదు, గర్భిణీ, బాలింతల వివరాలు తెలుసుకున్నా రు. సీడీపీవో సబిత పాల్గొన్నారు.

యూపీహెచ్‌సీ సందర్శన

విద్యానగర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం చేస్తామని రిట్రైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి స్పష్టం చేశారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. ఏడాదిన్నర కిత్రం ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన జీపీఎఫ్‌, జీఐఎస్‌,, కమ్యూటేషన్‌, గ్రాట్యూటీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌రావు, కోశాధికారి కనపర్తి దివాకర్‌, బూరుపల్లి రవీందర్‌, పాలోజు రవీందర్‌, జాలి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

పనులు పూర్తి చేయాలి1
1/3

పనులు పూర్తి చేయాలి

పనులు పూర్తి చేయాలి2
2/3

పనులు పూర్తి చేయాలి

పనులు పూర్తి చేయాలి3
3/3

పనులు పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement