హౌసింగ్‌బోర్డులో కబ్జాలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ హౌసింగ్‌బోర్డుకాలనీలోని భూ ఆక్రమణలపై వేటు పడింది. హౌసింగ్‌బోర్డు స్థలాలను కొంతమంది తప్పుడు సర్వేనంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ స్థలాలు చుట్టూ ప్రహరీ నిర్మించుకొని కబ్జా చేయడంపై గత నెలలో ‘నయా భూదందా’ పేరిట ‘సాక్షి’లో కథనం రావడం తెలి సిందే. హౌసింగ్‌బోర్డు విభాగం కార్యాలయం వరంగల్‌లో ఉంటుండడం, ఇక్కడ పర్యవేక్షణ కాస్త తగ్గిన నేపథ్యంలో వేలం వేయాల్సిన ఖాళీ స్థలాలను కొంతమంది కబ్జా పెట్టారు. ఈ దందాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో, వరంగల్ నుంచి హౌసింగ్ బోర్డు అధికారులు కరీంనగర్‌కు వచ్చి విచారణ చేపట్టారు. హౌసింగ్‌బోర్డు వరంగల్ డివిజన్ ఈఈ అంకమరావు ఆదేశాల మేరకు ఏఈ పృథ్వీరాజ్ హౌసింగ్‌బోర్డులోని కబ్జాలపై చర్యలు చేపట్టారు. కబ్జాలకు గురైన రెండు స్థలాల్లో చుట్టూ నిర్మించిన గోడను మంగళవారం జేసీబీతో తొలగించారు. రూ.కోట్ల విలువైన స్థలాలను కాపాడారు. హౌసింగ్‌బోర్డు స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు.
హౌసింగ్‌బోర్డులో కబ్జాలు తొలగింపు


