వెంటపడి వేధించాడు..
రామగిరి(మంథని): సెంటినరీకాలనీలో శుక్రవారం జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించినట్లు గోదావరిఖని ఏసీపీ రమే శ్ శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. న్యూమారేడ్‌పాకకు చెందిన కోట చిరంజీవి పోతన కాలనీలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. 2019 లో భార్య మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నా డు. కమాన్‌పూర్ మండలం పేంచికల్‌పేటకు చెంది న పోలవేన సంధ్యారాణి పనిమీద మీసేవ సెంటర్ లో చిరంజీవిని కలిసింది. ఆ తర్వాత ఆమెకు ఫోన్ కాల్స్ చేస్తూ, మేసేజీ పంపించడం ప్రారంభించా డు. ‘నువ్వంటే నాకిష్టమని, నీతోనే ఉంటానని, ఒ ప్పుకోపోతే చంపుతా’నని బెదిరించాడు. భయపడి న ఆమె చిరంజీవితో మాట్లాడుతూ ఉండేది. కొంత కాలం తర్వాత మాటలు బంద్‌చేసి చిరంజీవిని దూ రం పెట్టింది. ఆగ్రహించిన చిరంజీవి.. తనతో మా ట్లాడకుంటే ఆమెను, భర్తను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. భరించలేక రెండు నెలల క్రితం భర్త కుమార్‌కు విషయం చెప్పింది. ఆమె భ ర్తను కూడా చంపుతానని, పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో నెలక్రితం పంచాయితీ జరిగింది. అ యినా చిరంజీవిలో మార్పురాలేదు. శుక్రవారం సెంటినరికాలనీలో సంధ్యారాణి పనిచేసే కార్యాలయానికి వెళ్లి గొడవపడ్డాడు. దీంతో ఆమె తన భర్త పోలవేన కుమార్, అన్నయ్య అనవేన నరేశ్‌కు ఫోన్ విషయం చెప్పింది. దీంతో భర్త, అన్నయ్య, తండ్రి అనవేన మల్లయ్య, బావమరిది పిడుగు చందు ఘ టనా స్థలానికి చేరుకున్నారు. చిరంజీవితో గొడవప డి చేతులతో కొట్టారు. మల్లయ్య వెంట తీసుకొచ్చి న ఇనుపరాడు, చాకుతో తీవ్రంగా గాయపర్చడంతోపాటు తలపై రాడ్‌తో కొట్టడంతో చిరంజీవి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. శనివారం ఉదయం పెంచికల్‌పేట ఎక్స్‌రోడ్డు వద్ద నిందితులు సంధ్యారాణి, కుమార్, నరేశ్, మల్లయ్య, చందును అదుపులోకి తీసుకున్నారు. మూడు బైక్‌లు, హత్య కు ఉపయోగించిన ఇనుపరాడ్, చాక్ స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన మంథని, గోదావరిఖని సీఐలు రాజు, ప్రసాద్‌రావు, ఎస్సైలు శ్రీనివాస్, పురుషోత్తం దివ్య, ప్రసాద్, రవి కుమార్‌ను ఏసీపీ అభినందించారు.
మాట్లాడకుంటే అందరినీ చంపుతానని బెదిరించాడు
భరించలేకనే మీసేవ నిర్వాహకుడి హత్య
హత్య ఘటన వివరాలు వెల్లడించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్


