
మహనీయుడు కొండా లక్మణ్ బాపూజీ
కరీంనగర్‌టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ఇంటినే త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావుతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ’ పేరుతో పౌర హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా ఈ తరం నాయకులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పలువురు పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదంటూ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దక్షిణాది వ్యక్తేనని, జీఎస్టీ సంస్కరణలతో ఏదైనా సమస్య ఉంటే ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.