మట్టిలో మాణిక్యాలు | - | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యాలు

Sep 22 2025 10:42 AM | Updated on Sep 22 2025 10:42 AM

మట్టి

మట్టిలో మాణిక్యాలు

అథ్లెటిక్స్‌లో ప్రతిభ కుస్తీలో బంగారం పసిడి పంచ్‌

చాంపియన్‌

బ్యాడ్మింటన్‌ స్టార్‌

బాక్సింగ్‌లో చిరుతలా..

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయికి చెందిన ఎల్‌.నిఖిత దుమాల ఏకలవ్య గురుకులంలో చదువుతోంది. అథ్లెటిక్స్‌లో తనకున్న ఆసక్తిని గమనించిన పీఈటీలు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. 100, 200 మీటర్లలో రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎంపికై ంది.

వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్‌.అక్షయ దుమా ల ఏకలవ్య గురుకులం విద్యార్థిని. కుస్తీలో తలపడితే పతకం ఖాయం చేసుకుంటుంది. మరిమడ్లలో జరిగిన పోటీల్లో కుస్తీలో సత్తా చాటి బంగా రు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికై ంది.

మహబూబాబాద్‌ జిల్లా కడ్తాల్‌కు చెందిన ఎన్‌.హరికి చిన్నపటి నుంచే బాక్సింగ్‌పై ఆసక్తి. గమనించిన స్థానిక పీఈటీ శిక్షణ ఇవ్వడంతో మెరికలా తయారయ్యాడు. ఇటీవల కొత్తగూడలో జరిగిన పోటీల్లో బాక్సింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బరిలో దిగితే పతకం ఖాయం.. బాక్సింగ్‌ రింగ్‌లో ఉంటే పంచ్‌ పడాల్సిందే.. వాలీబాల్‌ టీమ్‌ పాల్గొంటే ఎదుటి టీమ్‌ బేజార్‌ కావాల్సిందే.. కుస్తీ పడితే ప్రత్యర్థి లొంగిపోవాల్సిందే.. ఇదంతా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకుల విద్యార్థుల క్రీడానైపుణ్యానికి నిదర్శనం. ఏకలవ్య గురుకుల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొంటే పతకం పట్టుకొస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల కోనరావుపేట మండలం మరిమడ్ల, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాల పంట పండించారు. ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన 47 మంది క్రీడాకారులు ఒడిశాలో అక్టోబర్‌ రెండో వారంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

మైదానంలో చిరుతల్లా..

విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఇద్దరు పీఈటీల ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌(కుస్తీ), తైక్వాండో, జూడో, యోగా, బాక్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, షాట్‌పుట్‌, అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా విద్యార్థులను తయారు చేస్తున్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా ఇద్దరు పీఈటీలు ఉంటూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దుమాల గురుకులంలోని మైదానంలో శిక్షణ ఇస్తూ మెరికల్లా తయారు చేస్తున్నారు.

జాతీయస్థాయికి..

ఇటీవల కోనరావుపేట మండలం మరిమడ్ల, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలోని ఏకలవ్య గురుకులాల్లో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. దుమాల గురుకుల విద్యార్థులు 160 మందికి పైగా పోటీల్లో తలపడి పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో అకిర, ఆంజనేయులు, కుస్తీలో సాయిచరణ్‌, బాక్సింగ్‌లో హరి, బబ్లూ, కుస్తీలో చైతన్య, బాక్సింగ్‌లో శిరీష బంగారు పతకాలు, కుస్తీలో పూజిత, అక్షయ, అథ్లెటిక్స్‌లో నిఖిత, యోగాలో వర్షిణి, ఖోఖోలో మొదటి స్థానాలు సాధించారు. ఆయా క్రీడల్లో రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రతిభ చూపిన 47 మంది క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

గురుకులం విద్యార్థులు.. ఆటల్లో మెరికలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు

సత్తా చాటుతున్న దుమాల ఏకలవ్య చిన్నారులు 47 మంది జాతీయస్థాయికి ఎంపిక

మోతితండాకు చెందిన ఎస్‌.బబ్లూకు బాక్సింగ్‌ అంటే ప్రాణం. పీఈటీ పర్యవేక్షణలో బాక్సింగ్‌పై పట్టు సాధించిన బబ్లూ ఇటీవల కొత్తగూడలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు.

దుమాల గురుకులంలో 8వతరగతి చదువుతున్న ఎస్‌.ఆంజనేయులు షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపుతున్నాడు. కొత్తగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు.

8వతరగతి చదివే బి.శిరీషకు బాక్సింగ్‌ అంటే ఆసక్తి. పీఈటీ పర్యవేక్షణలో నైపుణ్యం సాధించిన శిరీష.. మరిమడ్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది.

మట్టిలో మాణిక్యాలు1
1/6

మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు2
2/6

మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు3
3/6

మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు4
4/6

మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు5
5/6

మట్టిలో మాణిక్యాలు

మట్టిలో మాణిక్యాలు6
6/6

మట్టిలో మాణిక్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement