
దినసరి కూలీ బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్‌కు చెందిన రాయికంటి రాజయ్య(56) అనే దినసరి కూలీ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంట్లో ఆదివారం వేకువజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మోతీరాంనాయక్ వివరాల ప్రకారం.. రాజయ్య దినసరి కూలీగా పని చేస్తుంటాడు. వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు చెప్పినా వినలేదు. శనివారం రాత్రి తాగి వచ్చి కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. తాగిన మైకంలో రాత్రి తన ఇంట్లోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెల్లారి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధురాలు..
మానకొండూర్: ముంజంపల్లి గ్రామానికి చెందిన గట్టు నర్సమ్మ(85) అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. నర్సమ్మ ఈనెల 17న తిమ్మాపూర్ మండలం పొరండ్లలో ఉంటున్న తన కూతురు వద్దకెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ముంజంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం మృతదేహం ఉందని తెలియడంతో.. బావి వద్దకెళ్లిన కుమారుడు వెంకటి తల్లిదేనని గుర్తించారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
ధర్మారం: కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేశ్‌నాయక్(45) అనే రైతు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. మల్లేశ్‌నాయక్ గ్రామ శివారులోని ఇప్పల వద్ద తన వరి పొలంలో పక్షులు రాకుండా మెరుపు రిబ్బన్లు కడుతున్నాడు. ప్రమాదవశాత్తు దగ్గర్లోనే ఉన్న 11కేవీ విద్యుత్ తీగలకు మెరుపు రిబ్బన్ తాకి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు అఖిల, రాజేశ్వరి, కుమారుడు అభిరాం ఉన్నారు.
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడు హైదరా బాద్‌లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి ంది. స్థానికుల కథనం ప్రకా రం.. దావనపల్లి అరవింద్(29) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన వినూత్నతో 6 మాసాల క్రితం వివా హం జరిగింది. వీరిద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో.. హైదరాబాద్‌లో ఉంటున్నారు. అరవింద్ బలవన్మరణానికి పాల్పడడంతో.. గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
మానేరులో మునిగి వ్యక్తి..
ఓదెల: పొత్కపల్లి పోలీస్ స్టేష న్ పరిధిలోని గుంపుల మానేరులో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రా మానికి చెందిన ఆరెల్లి రవీందర్‌గౌడ్(45) అనే వ్యక్తి ఆదివా రం ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. గంగ స్నానం కోసం వచ్చి మా నేరులోకి వెళ్లి అకస్మాత్తుగా మునిగిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సౌదీలో తక్కళ్లపెల్లి వాసి..
కథలాపూర్: తక్కళ్లపెల్లి గ్రా మానికి చెందిన సంగ మల్లయ్య(58) అనే వ్యక్తి సౌదీఅరేబియా దేశంలో అనారోగ్యంతో మృతిచెందినట్లు ఆదివా రం గ్రామస్తులు తెలిపారు. మల్లయ్య కొంతకాలంగా ఉపాధి నిమిత్తం సౌదీఅరేబియా వెళ్తూ వస్తున్నారు. చివరగా 2 నెలల క్రితం మల్లయ్య ఇంటికొచ్చి వెళ్లారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సౌదీఅరేబియాలోని ఆయిల్ ఏరియాలో తోట కాపరిగా పని చేసేవారు. ఈనెల 15న మల్లయ్య తన గదిలో ఉండగా.. బీపీ పెరగడంతో స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడున్నారు.

దినసరి కూలీ బలవన్మరణం

దినసరి కూలీ బలవన్మరణం

దినసరి కూలీ బలవన్మరణం

దినసరి కూలీ బలవన్మరణం