
ఇబ్బంది లేకుండా చర్యలు
బతుకమ్మ, దసరాకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. దీనికి సంబంధించి అధికారులకు విధులు కేటాయించాం. డీఎంలు, ఇతర అధికారులు బస్టాండ్‌లో మకాం వేసి ప్రయాణికులకు అనుగుణంగా బస్సలు తిరిగేలా చూస్తారు. ముందస్తుగా రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. – బి.రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం
50 శాతం పెంచడం తగదు
దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సుల పేరిట టికెట్‌పై 50శాతం పెంచి వసూలు చేయడం సామాన్యుల నోట్లో మట్టికొట్టడమే. రెండు పండుగలకు ఎక్కడెక్కడో ఉన్న వారు సొంతూళ్లకు వస్తుంటారు. ఆర్టీసీ పెంచిన చార్జీలు సామాన్య ప్రజల జేబులను గుల్ల చేయడమే. అదనపు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి

ఇబ్బంది లేకుండా చర్యలు