
రియల్టర్ హత్య కేసులో మరో ఇద్దరు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేశ్(55) హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కారులోనే రమేశ్ గొంతు కోసి హత్య చేసిన ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు సమాచారం. సిరిసిల్లలోని రమేశ్ ఇంటి నుంచి కారులో శుక్రవారం తీసుకెళ్లిన వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. తొలుత అతడొక్కడే హత్య చేసినట్లు చెప్పినా.. తరువాత పోలీసుల విచారణలో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు తెలిసింది. రమేశ్ భార్య అనీల ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్, సిరిసిల్లకు చెందిన సిరిగిరి మురళి, లింగన్నపేటకు చెందిన రాధాకృష్ణ, ఖమ్మంకు చెందిన శేషగిరిరావు, రాము, వేములవాడకు చెందిన పాస్టర్ వేణు, తిప్పాపూర్‌కు చెందిన కుంటయ్య, గంగయ్యపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది..? ఎవరు పాల్గొన్నారనే అంశాలను పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఏఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు
వేములవాడ ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి ఆధ్వర్యంలో హత్య కేసు దర్యాప్తు సాగుతోంది. అన్ని ఆధారాలతో హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు శాసీ్త్రయంగా విచారణ జరుపుతున్నారు. మృతుడి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. హత్య జరిగిన ప్రదేశంలో, అటుగా వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హత్య ఎన్ని గంటలకు జరిగింది.. ఎవరెవరు సహకరించారు.. సూత్రధారులెవరనే అంశాలను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించి ఈ హత్య జరిగినట్లు భావిస్తుండగా.. ఇలాంటి హత్యలు మళ్లీ జరగకుండా నిందితులకు శిక్ష పడేలా కేసు దర్యాప్తు శాసీ్త్రయంగా ఉండాలని పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఎస్సైల నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
సిరిసిల్లలో అంత్యక్రియలు
సిరిసిల్లలో ఆదివారం రమేశ్ అంత్యక్రియలు జరిగాయి. వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో శనివారం సాయంత్రమే పోస్టుమార్టం పూర్తి కాగా.. అతడి కొడుకు తేజస్విన్‌వర్మ చైన్నె నుంచి రాత్రి 11 గంటలకు సిరిసిల్లకు చేరుకున్నాడు. పెద్ద బజారు, నేతన్నచౌక్, గాంధీచౌక్ మీదుగా విద్యానగర్ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది.
లోతుగా ఆరా తీస్తున్న పోలీసులు
వేములవాడ ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు
సిరిసిల్లలో రమేశ్ అంత్యక్రియలు

రియల్టర్ హత్య కేసులో మరో ఇద్దరు