
హుస్నాాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టలో తొలిసాయుధ దళం ఎన్ కౌంటర్ కు గురైన ప్రాంతం (ఫైల్)
బాంచెన్ కాల్మొక్త అన్న సామాన్యులే.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం బందుకూతో గడి పునాదులను పెకిలించారు.. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం కదంతొక్కారు.. జాగిరీదారులు, మక్తేదారులు, ఇనాందారులు, వతన్‌దారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం సాగించారు..ఎందరో రజకార్లను తరిమికొట్టారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. అందులో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం మడమతిప్పని పోరాటం సాగించింది.. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా పలువురు యోధుల కథనాలు. – కరీంనగర్ / సిరిసిల్ల / ఇల్లంతకుంట / పెద్దపల్లి రూరల్ / బోయినపల్లి / మంథని రూరల్

బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025