
పర్యటన.. పరిశీలన
కరీంనగర్/చిగురుమామిడి: పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర విద్యాపరిశోధన , శిక్షణ సంస్థ డైరెక్టర్ గాజర్ల రమేష్ జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించి ఎల్‌ఎండీ కేంద్రంలోని డైట్ కళాశాలలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎల్‌ఎండీ కాలనీలోని ప్రైమరీ పాఠశాల, తిమ్మాపూర్ ఉన్నతపాఠశాల, ముల్కనూర్ హైస్కూల్, రేణిగుంట, చిగురుమామిడి హైస్కూళ్లలో పర్యటించి యూడైస్, ప్రీప్రైమరీ పాఠశాలల ప్రారంభం, పాఠశాలల్లో పనిచేస్తున్న కంప్యూటర్ల పనితీరు, పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు, ఎఫ్‌ఆర్‌ఎస్ స్టేటస్, పిల్లలకు అందించే వివిధ రకాల ఎన్టైటిమెంట్స్, ఏ ఎక్స్ ఎల్‌ఏఐ ల్యాబ్, టాస్ నమోదు, ఉల్లాస్ నమోదు, ఐఎఫ్‌సీ పనితీరు, అమ్మ ఆదర్శ పాఠశాల, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, మధ్యాహ్న భోజనం, పీఎంసీ పాఠశాలలు,పెండింగ్ బడ్జెట్, ఎస్‌ఎల్‌ఎన్‌ఎఫ్‌ఎల్ ఎన్‌ఐపీ రిపోర్ట్స్, లర్నింగ్ ఔట్స్ కమ్స్ మొదలగు వాటిపై సమీక్షించారు. అనంతరం డైట్ కళాశాలలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విద్యా కార్యక్రమాల్లో అలసత్వం వద్దని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రమేశ్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాంమొండయ్య, సెక్టోరియల్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, మహేందర్ పాల్గొన్నారు.