
ఊరూరా.. రైతన్న కన్నెర్ర
జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు ఒక్క బస్తా కోసం గంటల తరబడి క్యూలైన్లు పలుచోట్ల రోడ్డెక్కి రైతుల ఆందోళనలు పోటాపోటీగా నిరసనలకు దిగిన కాంగ్రెస్, బీజేపీలు
అదే వరుస.. తీరని వ్యథ
మానకొండూర్/గంగాధర/శంకరపట్నం/గన్నేరువరం: మానకొండూరులోని గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవా రం ఉదయమే యూరియా కోసం రైతులు బారులు తీరారు.నిల్చునే ఓపిక లేక చెప్పులు వరుసలో ఉంచారు. రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చారు. గంగాధర మండలం మల్లాపూర్, గోపాల్‌రావుపల్లి 240 బస్తాలు తెప్పించగా.. 300మంది రైతులు వచ్చారు. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 120మందికే ఇచ్చారు. మిగితావారు మరుసటి రోజు తీసుకుంటామని చిట్టీ రాయించుకున్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్, తాడికల్ సహకార సంఘం గోదాంల వద్ద పోలీసు పహారా మధ్య ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొ ప్పున ఇచ్చారు. గన్నేరువరం గ్రోమోర్‌లో 260, సహకార కేంద్రం ఆధ్వర్యంలో 460, గుండ్లపల్లి స్టేజీ వద్ద 260 బస్తాలు పంపిణీ చేశారు. యూరియా అందనివారు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ సొసైటీకి స్టాక్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు టోకెన్లు పంపిణీ చేసి, ఒక్కో రైతుకు ఒక్కో బస్తా ఇచ్చారు.
జిల్లాలో అన్నదాతకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఒక్క బస్తా అయినా ఇవ్వండంటూ గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఫలితం లేదు. టోకెన్లు దక్కిన వారికి సైతం యూరి యా ఇవ్వడం లేదు. దీంతో ఓపిక నశించిన కొందరు రైతులు మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రభుత్వంపై కన్నెర్రజేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రైతుల కష్టాలపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నాయకులు సైతం పోటాపోటీగా ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు నిర్వహించి, దిష్టిబొమ్మలు దహనం చేశారు.

ఊరూరా.. రైతన్న కన్నెర్ర