
కాళోజీకి ఘన నివాళి
కరీంనగర్ కల్చరల్/కరీంనగర్‌క్రైం: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ గౌస్ ఆలం కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఆర్‌ఐలు రజినీకాంత్(అడ్మిన్), శ్రీధర్‌రెడ్డి(వెల్ఫేర్) పాల్గొన్నారు.

కాళోజీకి ఘన నివాళి