
రోడ్డెక్కి ఆందోళన
కరీంనగర్/చిగురుమామిడి: రామడుగు మండలం వెదిర సహకార సంఘం గోదాం వద్ద కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. వచ్చిన లోడ్‌లో సగమే వెదిరలో దింపి, మిగితాలోడ్ వేరేచోటుకు తరలిస్తున్నారని గంటకు పైగా రహదారిపై బైఠాయించారు. విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు నెరెళ్ల మారుతి, రాల్లబండి పురుషోత్తంరెడ్డి, తొరికొండ అనిల్‌కుమార్, ఎడవెల్లి రాజిరెడ్డి, రత్నాకర్‌రెడ్డి, ముత్యం శేఖర్‌గౌడ్ పలువురు బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎస్సై కె.రాజు రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. చిగురుమామిడి సింగిల్‌విండో కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ఈనెల 1న 800 మందికి టోకెన్లు ఇచ్చారని ఇప్పటికీ యూరియా రాకపోవడంతో పంట నష్టపోతున్నామని మంగళవారం ఆందోళన నిర్వహించారు.