
‘మహాలక్ష్మి’ అమలులో ఇబ్బంది రానీయొద్దు
జగిత్యాలటౌన్: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ)సోలోమాన్ అన్నారు. మంగళవారం జగిత్యాల డిపోను సందర్శించిన ఆయనకు డిపో మేనేజర్ కల్పన, సిబ్బంది స్వాగతం పలికారు. డిపో పరిసరాలను పరిశీలించి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మహాలక్ష్మి పథకంలో ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. డిపో గ్యారేజీలో పరివర్తన ప్రోగ్రాంను అమలు చేయాలని కోరారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల పెంపుతోపాటు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ కవిత, ఎస్‌టిఐ శ్రీనివాస్, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ జోన్ ఈడీ సోలోమాన్