● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌కార్పొరేషన్: సప్తగిరికాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ భవనా న్ని పరిశీలించారు. విశాలంగా ఉన్న ఈ భవనంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, శుక్రవారం సభ నిర్వహించాల ని సూచించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
గడువులోగా పూర్తిచేయాలి
కరీంనగర్‌అర్బన్: ప్రభుత్వ పథకాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15 ఏళ్లు నిండిన బాలికలు, 50 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ గుర్తింపు హాజరును ఉపాధ్యాయుల సాధారణ సెలవులతో సోమవారం నుంచి లింక్ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు అన్ని ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి వసతులు, సౌకర్యాల నివేదిక సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.
ఆడిటోరియం పనుల పరిశీలన
కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
మండపాల వద్ద ప్రత్యేక నిఘా
కరీంనగర్‌క్రైం: మహిళలు, యువతులు, బాలికల భద్రతకు వినాయక మండపాలు, ఊరేగింపుల వద్ద షీ టీంలు ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. వినాయక నవరాత్రుల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేధింపులకు గురైనప్పుడు విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. కాలేజీలు, పాఠశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పని ప్రదేశాల్లో వేధింపులు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు నేరుగా సంప్రదించలేనివారు 87126 70759 నంబర్‌కు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆగస్టులో అందిన ఫిర్యాదుల ఆధారంగా 4 క్రిమినల్ కేసులు నమోదు చేయగా, 10 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 70 హాట్‌స్పాట్‌లలో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 30 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిగా లింగారెడ్డి
కరీంనగర్‌అర్బన్: జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి(డీవీహెచ్‌వో)గా డా.నల్ల లింగారెడ్డి నియమితులయ్యారు. సుధాకర్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయగా లింగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రం ఏడీగా వ్యవహరిస్తున్న లింగారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా పశుసంపద వృద్ధి, పాడి రైతులకు సత్వర సేవలందించేందుకు కృషి చేస్తానని లింగారెడ్డి తెలిపారు. ఏడీహెచ్‌లు వినోద్‌కుమార్, రామస్వామి, మహేందర్, సూపరింటెండెంట్లు గూడ ప్రభాకర్‌రెడ్డి, జగన్, డాక్టర్లు కోటేశ్వర్‌రావు, దివ్య, సాయిచైతన్య, సురేందర్‌రెడ్డి, భారతి, అరవింద్‌రెడ్డి, సుష్మిత, శశికాంత్, సాంబరావు, మనోహర్, కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
హెల్త్ సెంటర్‌ను ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
హెల్త్ సెంటర్‌ను ప్రభుత్వ భవనంలోకి మార్చాలి