
దర్జాగా బేస్‌మెంట్ నిర్మాణం
గ్రామ ప్రజల సౌకర్యార్థం నల్లాల బావి వద్దకు వెళ్లేందుకు 2007లో గ్రామ సభ తీర్మాణం చేసి 20 ఫీట్ల దారి తీశారు. 4ఫీట్ల డ్రైనేజీ నిర్మించారు. మహేశ్ అనే వ్యక్తి డ్రైనేజీని పూడ్చివేసి రోడ్డుకు అడ్డంగా బేస్‌మెంట్ నిర్మించాడు. దీంతో నీరు నిలిచి, దోమలు పెరిగి దుర్వాసన వెదజల్లుతోంది. సదరు నిర్మాణాన్ని కూల్చేలా చర్యలు చేపట్టండి.
– మోతె గ్రామస్తులు, రామడుగు
భర్త రామకృష్ణ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2019లో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృతిచెందాడు. కుటుంబ పోషణ భారంగా ఉంది. కూలీ పనులు చేసుకుంటూ కూతురిని చదివిస్తున్న. వితంతు పింఛన్ కోసం ఐదేళ్లుగా తిరుగుతున్నా. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
– రజిత, కరీంనగర్

దర్జాగా బేస్‌మెంట్ నిర్మాణం