
ఖాళీ ప్రాంతాలు.. రోగాలకు ఆవాసాలు
సీతారాంపూర్‌కాలనీలో రెడ్డి ఫంక్షన్‌హాల్
పక్కన భవనాల మధ్య మురుగునీరు
రేకుర్తిలోని పాత గ్రామ పంచాయతీ
భవనం వెనుక నిలిచిన మురుగునీరు
శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో
నివాసాల మధ్య నిలిచిన వర్షపు నీరు
వాతావరణంలో మార్పులతో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండగా.. ఇటీవల కురిసిన వర్షాలతో నివాసాల మధ్య నీరు నిలిచి రోగాలకు ఆవాసంగా మారుతున్నాయి. నగరంతో పాటు శివారు కాలనీల్లో ఇళ్లమధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. రోడ్లపై మురుగు పారుతోంది. ఓ వైపు చల్లబడ్డ వాతావరణం... మరోవైపు ఇళ్లమధ్య మురుగుతో నగర ప్రజలు రోగాల పాలవుతున్నారు. వైరల్, డెంగీ జ్వరాలతో ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. నగరంలోని లక్ష్మీనగర్, భగత్‌నగర్, తిరుమల్‌నగర్, కోతిరాంపూర్, రాంనగర్, మారుతినగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, విద్యానగర్, వావిలాలపల్లితో పాటు శివారు ప్రాంతాలైన శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహడ్‌తో పాటు తదితర ప్రాంతాల్లో ఇళ్లమధ్య వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయమై చొరవ తీసుకుని, సమస్య పరిష్కరించాలని ఆయా ప్రాంతాలవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్

ఖాళీ ప్రాంతాలు.. రోగాలకు ఆవాసాలు

ఖాళీ ప్రాంతాలు.. రోగాలకు ఆవాసాలు