
నూతన కానిస్టేబుళ్లకు శిక్షణ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సీపీ గౌస్‌ఆలం తెలిపారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని ఐటీకోర్ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నూతన కానిస్టేబుళ్లకు ప్రాథమిక శిక్షణతో పాటు టెక్నాలజీపై పట్టు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వారంరోజుల శిక్షణలో భాగంగా, పిటిషన్ డ్రాఫ్టింగ్ నుంచి చార్జిషీట్ దాఖలు వరకు గల విధానాలు, సీసీటీఎన్‌ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఈ–సమన్ల జారీ, టీఎస్ కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్ సీఈఐఆర్, సైబర్ క్రైంలో ఆర్థిక, ఆర్థికేతర నేరాలు, సీడీఆర్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్‌లపై సమగ్ర శిక్షణ ఉంటుందని వివరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు జి.విజయకుమార్, వేణుగోపాల్, ఐటీ కోర్ సీఐ జె.సరిలాల్ పాల్గొన్నారు.