
ఇంటర్ లాకింగ్ స్టార్ట్!
● పెద్దపల్లి–కరీంనగర్ లైన్ల అనుసంధానం షురూ ● 24 నుంచి 27 వరకు పనులు చేపట్టనున్న దక్షిణ మధ్య రైల్వే ● కాజీపేట బల్హార్షా మార్గంలో పలు రైళ్ల మళ్లింపు ● కొన్ని పూర్తిగా రద్దు, మరి కొన్ని ఆలస్యం ● బైపాస్ స్టేషన్ నిర్మించే వరకూ పెద్దపల్లిలోనే రైళ్ల హాల్టింగ్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఎట్టకేలకు పెద్దపల్లి–జగిత్యాల సెక్షన్, కాజీపేట–బల్హార్షా సెక్షన్ ఇంటర్‌లాకింగ్ పనులు మొదలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల కలనెరవేరనుంది. పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కు సమీపంలో బైపాస్ రైల్వే మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నెల 24 నుంచి 27 వరకు ఇంటర్ లాకింగ్ పనులను దక్షిణమధ్య రైల్వే చేపట్టనుంది. దీంతో కాజీపేట–బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి–జగిత్యాల మార్గాలను అనుసంధానం పూర్తికానుంది. ఈ కారణంగా కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు, కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
రద్దయిన రైళ్లు
67771/72 కరీంనగర్–సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్ మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీల్లో )
17003/04 రామగిరి మెము ఎక్స్ ప్రెస్ ( 25 నుంచి 27 వ తేదీల్లో)
17035/36 బల్లార్షా నుంచి కాజీపేట వరకు బల్హార్షా ఎక్స్ ప్రెస్ ( 24 నుంచి 26 తేదీల్లో ఎగువ మార్గంలో బల్హార్షా వైపు , 25 నుంచి 27 తేదీల్లో దిగువ మార్గంలో కాజీపేట వైపు )
12757/58 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈ నెల 25 నుంచి 27 తేదీల్లో పూర్తిగా రద్దుచేశారు.

ఇంటర్ లాకింగ్ స్టార్ట్!