
దాశరథి పురస్కారం అందుకున్న అన్నవరం
కరీంనగర్‌కల్చరల్: ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌కు మంగళవారం దాశరథి కృష్టమాచార్య పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు జుపల్లి కృష్టారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పలువురు సాహితీవేత్తలు, కవులు అవార్డు గ్రహీతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యాన పంటలకు రాయితీ
● జిల్లా అఽధికారి కమలాకర్‌రెడ్డి
గంగాధర: ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు వర్తింపజేస్తోందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి సూచించారు. గంగాధర మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం డివిజన్‌స్థాయిలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్ సాగు తో అధిక ఆదాయం వస్తుందన్నారు. ఒక్కసారి సాగుచేస్తే 30 ఏళ్లవరకూ నిరంతరంగా దిగుబడి ఇస్తుందని తెలిపారు. జిల్లాలో 2,350 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగువుతన్నట్లు ఆయన వివరించారు. ఆసక్తి గలరైతులు ఉద్యానవన అధికారి లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. అనంతరం గంగాధరలో ఓ రైతు సాగు చేస్తున్న పండ్లతోటను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, డివిజన్ ఉద్యానవన అధికారి రోహిత్, ఏఈవో వేదిక, లోహియా, ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్ రైతులు ఉన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఏఈఏ త్రినాథ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్‌గా త్రినాథ్ దత్తు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన త్రినాథ్‌ను టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీని వాస్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్య క్రమంలో టీఎన్జీవోల సంఘం నగర అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, నాయకులు కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, ఆరవెళ్లి రాజేశ్వరరావు, పవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్‌క్రైం: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో 2025–26 విద్యా సంవత్సరానికి ఖాళీ పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని, పీహెచ్‌డీ, నెట్‌సెట్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, 26న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నేడు మహాలక్ష్మి సంబురాలు
కరీంనగర్: మహాలక్ష్మి పథకం 200 కోట్ల ఉచిత ప్రయాణాలు మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ బీఆర్ అంబేడ్కర్ బస్‌స్టేషన్ ఆవరణలో సంబురాలు నిర్వహించనున్నట్లు రీజనల్ మేనేజర్ తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి చీఫ్‌గెస్ట్‌గా హాజరవుతారని ఆయన వివరించారు.

దాశరథి పురస్కారం అందుకున్న అన్నవరం

దాశరథి పురస్కారం అందుకున్న అన్నవరం