
● పీఎం ఆవాస్ యోజన యాప్‌లో నమోదు ● సాంకేతిక సమస్యలతో జా
కరీంనగర్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అధికారులు మళ్లీ సేకరిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయంలో కేంద్రం వాటా ఉండటంతో ప్రధానమంతి ఆవాస్ గ్రామీణ్‌యో జన ప్లస్ యాప్‌లో ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు అందిస్తోంది. కేంద్రం పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.72వేల ఆర్థికసాయం చేస్తోంది. జిల్లాలో గత ఐ దు రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శులు యా ప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో ఆలస్యం
పంచాయతీ కార్యదర్శులు ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ యాప్‌లో లాగిన్ అయిన అనంతరం లబ్ధిదా రుల పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పేరు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబరు, కుటుంబసభ్యులు, గ్రామం, మండలం, జిల్లా తదితర 60 ప్రశ్నల సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. యాప్ లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో సర్వేలో జాప్యమేర్పడుతోంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 6,140 మంది లబ్ధిదారులుండగా ఇప్పటివరకు 1,708 మంది వివరాలు సేకరించారు. పాత సెల్‌ఫోన్లతో యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, లబ్ధిదారుల ఫొటో, బయోమెట్రిక్ కలువకపోవడం, ఆధార్‌కార్డు వివరాలు సరిపోకపోవడం, మ్యాపింగ్ తదితర సమస్యలు ఎదురవుతున్నాయని పంచా యతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు ఖాళీ స్థలం ఫొటో తీసి యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం వివిధ దశలో పనులు కొనసాగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఫొటో తీసి నమోదు చేస్తున్నట్లు తె లుస్తోంది. రెండో విడతలో మంజూరైన ఇండ్ల నిర్మాణాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు.
సైదాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను
పరిశీలిస్తున్న హౌజింగ్ డీఎం గంగాధర్
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
మంజూరైన ఇళ్లు 8,238
ముగ్గుపోసినవి 5,331
నిర్మాణం ప్రారంభించినవి 1,586
బేస్‌మెంట్‌స్థాయి 1,264
లెంటల్‌స్థాయి 167
స్లాబ్‌స్థాయి 155
మున్సిపల్ పరిధిలో 2,098
గ్రామీణ ఇళ్లు 6,140
సర్వే పూర్తయినవి 1,708
త్వరలో సర్వే పూర్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల రీసర్వే చేపట్టాం. యాప్‌లో కొన్ని సాంకేతిక సమస్యలతో వివరాల నమోదులో జాప్యమేర్పడింది. లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి. త్వరలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం.
– గంగాధర్, పీడీ, జిల్లా గృహనిర్మాణ సంస్థ