
యువకుడి ఆత్మహత్య
మల్యాల: పని దొరకడం లేదన్న బాధతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నూకపల్లి డబుల్ రూం ఇళ్లలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివాసం ఉంటున్న మహమ్మద్ షబ్బీర్(20) కూలీ. కొంతకాలంగా పని దొరకడం లేదని బాధపడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
బర్రెను కట్టేయబోయి.. ప్రాణాలు కోల్పోయి
● ప్రమాదవశాత్తు రైతు మృతి
వేములవాడరూరల్: రోజు మాదిరిగానే బర్రెను కట్టేయబోగా.. అది ఎదురుతిరగడంతో తీవ్రంగా గాయపడ్డ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం వెంకటాంపల్లికి చెందిన కర్ర అనంతరెడ్డి రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి గేదెకు ముకుతాడు వేసి కట్టేసేందుకు ప్రయత్నించాడు. అకస్మాత్తుగా ఎదురుతిరగడంతో కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య అలియ, ఒక కూతురు ఉన్నారు.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కారులో కుక్కపిల్లను తీసుకెళ్తున్న క్రమంలో సీటులోంచి కుక్కపిల్ల సడన్‌గా పక్కకు దూకే ప్రయత్నం చేస్తుండగా.. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి దృష్టి మళ్లడంతో ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన మండల కేంద్రంలో సోమవారం వేకువజామున జరిగింది. మండలంలోని హరిదాస్‌నగర్‌కు చెందిన జక్కుల ప్రశాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాచర్లగొల్లపల్లి వైపు వెళ్తున్నాడు. కారులో ఉన్న కుక్కపిల్ల ఉన్నట్టుండి పక్కకు దూకగా, దాన్ని నిలువరించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రశాంత్‌కు తీవ్ర, భార్య, ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి.

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య