25 నుంచి శ్రావణమాసం పూజలు | - | Sakshi
Sakshi News home page

25 నుంచి శ్రావణమాసం పూజలు

Jul 22 2025 8:03 AM | Updated on Jul 22 2025 8:03 AM

25 నుంచి శ్రావణమాసం పూజలు

25 నుంచి శ్రావణమాసం పూజలు

వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 25 నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో రాధాభాయి సోమవారం తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాన కార్యక్రమాలు ఇవీ..

● జూలై 25 (మొదటి శుక్రవారం) : శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

● జూలై 28 (మొదటి సోమవారం) : శ్రీస్వామికి అభిషేకాలు, రాత్రి మహాలింగార్చన

● ఆగస్టు 1 (రెండో శుక్రవారం) : శ్రీరాజరాజేశ్వరీదేవీకు ప్రత్యేక పూజలు

● ఆగస్టు 4 (రెండో సోమవారం) : ఉదయం 5:30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారి ప్రత్యేక పూజలు

● ఆగస్టు 8 (మూడో శుక్రవారం) : వరలక్ష్మీ వ్రతం, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు

● ఆగస్టు 9 (శనివారం) : రాఖీ పౌర్ణమి

● ఆగస్టు 11 (మూడో సోమవారం) : ఉదయం 5:30 నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామికి ప్రత్యేక పూజలు

● ఆగస్టు 15 (నాలుగో శుక్రవారం) : శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

● ఆగస్టు 16 (శనివారం – శ్రీకృష్ణాష్టమి) : రాత్రి 8 గంటలకు శ్రీకృష్ణలీలలు ఉట్లుకొట్టే వేడుక

● ఆగస్టు 18 (నాగుల చవితి) : ఉదయం 5:30 నుంచి మహాన్యాస రుద్రాభిషేకం

● ఆగస్టు 19 (ఆరుద్ర నక్షత్రం) : ఉదయం 5:30 నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

● ఆగస్టు 21 (మాసశివరాత్రి) : ఉదయం 5:30 నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

● ఆగస్టు 22 (శుక్రవారం) : అమ్మవారికి ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ముగుస్తాయి.

రాజన్న ఆలయ ఈవో రాధాభాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement