
వసతి జగిత్యాలలో..
జగిత్యాలఅగ్రికల్చర్: సామాజికంగా వెనుకబడిన విద్యార్థినులు మెడికల్, వ్యవసాయ, ఇంజినీరింగ్, న్యాయవిద్య వంటి కోర్సులు చదువాలని ఆకాంక్ష ఉన్నా.. సీట్లు లభించడం చాలా కష్టం. అయితే ఎస్సీ విద్యార్థినులకు గురుకులం సొసైటీ కింద వ్యవసాయ విద్య అందించేలా గత ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా శ్రీకారం చుట్టింది. వ్యవసాయ కోర్సులో చేరిన విద్యార్థినులకు ప్రస్తుతం సరైన వసతులు కల్పించలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. దీంతో వ్యవసాయ విద్యార్థినులు ధర్నాలు, ఆందోళనలు చేయడంతో స్పందించిన ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించి సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ కింద ఉన్న విద్యార్థినులకు జగిత్యాల శివారులోని పొలాసలోగల వ్యవసాయ కళాశాలకు బదిలీ చేశారు.
తొలుత సిద్దిపేటలో.. తర్వాత కోరుట్లలో..
సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ కింద ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను తొలుత మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో పెట్టాలని నిర్ణయించారు. తర్వాత వివిధ కారణాలతో సిద్దిపేట జిల్లా దోర్నాలకు మార్చాలనుకున్నారు. చివరకు 2023–24లో జగిత్యాలలోని కోరుట్లలో ఏర్పాటు చేశారు. తొలి బ్యాచ్‌గా 50 మంది విద్యార్థులను తీసుకున్నారు. ఆ తర్వాత ధర్మపురికి మార్చాలనుకున్నారు. ప్రవేశాలు తీసుకున్నప్పటికీ సరైన టీచింగ్ స్టాఫ్ లేదు, ఎలా ముందుకు పోవాలో తెలియదు. తరగతులు నిర్వహణ, విద్యార్థినులు ఉండేందుకు సరైన వసతులు లేకుండా పోయాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకుంటూ ఏడాదిపాటు నెట్టుకొచ్చారు. అయినప్పటికీ సరైన వసతులు కల్పించకుండానే రెండో బ్యాచ్ కింద 40 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించారు. విద్యార్థినుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రాక్టీకల్స్, సరైన బోధన సిబ్బంది లేక విద్యార్థినులు అనేక అవస్థలు పడ్డారు. దీంతో విద్యార్థినులు రాస్తారోకోలు చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలు కఠినం
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రైవేట్ కళాశాలకు రాష్ట్రంలో అనుమతి లేదు. అలాంటి నిబంధనలు సవరించడం ఆషామాషి కాదు. ఈ బాధతను ప్రభుత్వం వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానయ్య, సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ కమిషనర్ అలుగు వర్షిణికి అప్పగించారు. వీరు కోరుట్ల వ్యవసాయ విద్యార్థినుల సమస్య పరిష్కరించేందుకు వర్సిటీ, సోషల్ వెల్ఫేర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలుమార్లు చర్చించింది. సామాజిక కోణంలో ఆలోచించి, పేద విద్యార్థినుల భవిష్యత్ దెబ్బతినకుండా కోరుట్ల వ్యవసాయ విద్యార్థినులను సమీపంలోని పొలాస వ్యవసాయ కళాశాలకు తరలించాలని నిర్ణయించారు.
సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లోనే వసతి
పొలాస వ్యవసాయ కళాశాలలో చేరిన 90 మంది విద్యార్థినులకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డులో ఉన్న గురుకులం డిగ్రీ కళాశాలలో హాస్టల్ వసతి కల్పించారు. ఆ విద్యార్థినులకు అవసరమైన కాస్మోటిక్ చార్జీలు సోషల్ వెల్ఫేర్ సొసైటీ అందించనుంది. ప్రతి రోజు విద్యార్థినులు గురుకులం డిగ్రీ హాస్టల్‌లో ఉంటూ.. చదువుకునేందుకు పొలాస వ్యవసాయ కళాశాలకు వెళ్లాల్సి ఉంది. విద్యార్థినుల కోసం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థినులకు చదువు చెప్పినందుకు వ్యవసాయ వర్సిటీకి రూ.9.50 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు. ఇందులో ఇప్పటికే రూ.5 కోట్ల వరకు బడ్జెట్‌ను వ్యవసాయ వర్సిటీకి అందించారు.
చదువు ‘పొలాస’లో..
సదాశయంతో ముందుకొచ్చిన అధికారులు
సామాజిక కోణంలో ఆలోచించిన వర్సిటీ
కోరుట్ల వ్యవసాయ విద్యార్థినుల తరలింపులో పాట్లు
ప్రస్తుతం వసతులు బాగున్నాయంటున్న విద్యార్థినులు
ప్రత్యేక క్లాస్‌లకు సిద్ధం
కోరుట్ల నుంచి వచ్చిన వ్య వసాయ విద్యార్థినులకు వి విధ సబ్జెక్టులు బోధించేందుకు అవసరమైతే ప్రత్యేక క్లాస్‌లు తీసుకునేందుకు సి ద్ధంగా ఉన్నాం. పొలాస క ళాశాలలో డిజిటల్ ల్రైబరీ, మ్యూజిక్, ప్లే గ్రౌండ్, ప్రాక్టీకల్స్ వంటి వసతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఉన్నతంగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. – భారతీ నారాయణ్ భట్,
అసోసియేట్ డీన్, పొలాస

వసతి జగిత్యాలలో..