
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
● రెండు ట్రాక్టర్లు సీజ్
కొడిమ్యాల: మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 192లో గల పల్లె ప్రకృతి వనానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు బ్లేడ్ ట్రాక్టర్ల సహాయంతో చదును చేయించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కబ్జాకు యత్నించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి తహసీల్దార్ కిరణ్ తెలిపారు.