
‘బనకచర్ల’పై సీఎంల తలోమాట సరికాదు
హుజూరాబాద్: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాలు తలోమాట చెప్పడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నెలకొన్న జలవివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిందన్నారు. ఇరు రాష్ట్రాలు వేర్వేరు ఎజెండాలతో సమావేశానికి హాజరయ్యాయని, ఆయా ఎజెండాలలోని అంశాలపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించిందన్నారు. ఇది కేంద్రం సాధించిన తొలి విజయమని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అయితే రెండు రాష్ట్రాల సీఎం, మంత్రులు బ నకచర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యమేసిందని పేర్కొన్నారు. జల వివాదాలపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి ఏపీ ప్రభుత్వంతో కుమ్కకై ్క కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో ఉన్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి బనకచర్లపై లేనిపోని వివాదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని తె లిపారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ చాలా క్లియర్‌గా ఉందని, 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకేనంటే కేంద్రాన్ని ఒప్పిస్తామని, కానీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తానంటే ఒ ప్పుకునే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో 51 శాతం బీసీ జనాభా ఉందని, కానీ 32 శాతం మాత్రమే ఇస్తామనడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేష న్ అధికారుల అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. ఏసీబీ దాడుల్లో వందల కోట్లు పట్టుపడుతున్నాయని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి ఎ లా పాల్పడిందో వీళ్లను చూస్తే అర్థమవుతోందన్నా రు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ సహా కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలున్నా.. 19 నెలలుగా దోషులుగా తేల్చలేకపోయిందని, ఇది కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరం సహా బీఆర్‌ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ కోరితే జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 24న విచారణకు రావాలని సిట్ పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని, విచారణకు హాజరవుతానని పే ర్కొన్నారు. బీజేపీలో గ్రూపుల్లేవని, ఉన్నదల్లా మోదీ గ్రూపేనని పేర్కొన్నారు. ఆ వర్గం ఈ వర్గమంటూ ఉండదని, జెండా కోసం, పార్టీ కోసం పనిచేయాలే అంతే తప్ప వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రస క్తే లేదన్నారు. బండి వర్గమైనా.. ఇంకో వర్గమైనా ఉ పేక్షించబోమని, ఎవరికీ టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో అత్యధికంగా రూ.219 కోట్ల సీ ఆర్‌ఐఎఫ్ నిధులను కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తున్నానని, మరో రూ.150 కోట్లదాకా నిధులు తీసుకురాబోతున్నానని తెలిపారు. ఎంపీగా తాను 2.25 లక్షల మెజా రిటీతో గెలిచానంటే కార్యకర్తల కష్టమేననీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటాననీ భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీలో గ్రూపుల్లేవ్.. ఉన్నదల్లా మోదీ గ్రూపే
గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో 24న సిట్ ముందు విచారణకు హాజరవుతున్నా
కాళేశ్వరంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అధికారుల అక్రమాస్తులే నిదర్శనం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్