
విలువలతో కూడిన విద్య సోషలిజంతోనే సాధ్యం
కరీంనగర్: సామాజిక స్పృహ, విలువలతో కూడిన విద్య కేవలం సోషలిజం ద్వారానే సాధ్యమని, నేటి విద్యార్థి, యువత సోషలిస్టు సమాజ నిర్మాణంలో క్రియాశీలక భాగస్వాములు కావాలని అఖిలభారత విద్యా పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు రెండోరోజు కొనసాగాయి. శ్రీజాతీయత– దేశభక్తిశ్రీ అనే అంశాన్ని విద్యా పరిరక్షణ కమిటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ పట్నాయాక్ బోధించారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుల– జీవిత చరిత్రశ్రీ అనే క్లాసును పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ నాయకులు కొత్తపల్లి రవి వివరించారు. ‘నిర్మాణం– పని విధానం’ అంశాన్ని పీడీఎస్‌యూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడే ఆవుల అశోక్ బోధించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, నరేందర్, భాస్కర్, ఎర్ర అఖిల్ కుమార్, సహాయ కార్యదర్శులు సాయి, కర్క గణేశ్, సురేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.