
మేధస్సుకు పదును చదరంగం
● అడిషనల్ డీసీపీ వెంకటరమణ
● ముగిసిన 3వ ఆలిండియా జూనియర్, ఓపెన్ చెస్ టోర్నీ
కరీంనగర్‌స్పోర్ట్స్: చిన్నారుల మేధస్సుకు చదరంగం పదును పెడుతుందని కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని వీకన్వెన్షన్‌లో జీనీయస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ఆలిండియా జూనియర్, ఓపెన్‌చెస్ చాంపియన్‌షిప్– 2025 పోటీలు ఆదివారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ వెంకటరమణ హాజరయ్యారు. విజేతలకు ట్రోపీలు, నగదు పురస్కారం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంగా జాతీయ పోటీలు జరగడం అభినందనీయమన్నారు. చెస్‌తో చిన్నారుల్లో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారత చదరంగ క్రీడాకారులు నంబర్‌వన్ స్థానంలో నిలుస్తున్నారని తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ డైరెక్టర్, కోచ్ కంకటి అనూప్‌కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో 3వ ఆలిండియా పోటీలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య, అర్బిటర్లు బొల్లం సంపత్, అమిత్, కంకటి సృజన్‌కుమార్, కె.సతీశ్‌బాబు పాల్గొన్నారు.